ఇదంతా నా రీఎంట్రీ కోసమే: పృథ్వీ షా
భారత జట్టులోకి పునరాగమనం కోసమే తాను ఇంకా క్రికెట్ ఆడుతున్నానని యువ ప్లేయర్ పృథ్వీ షా పేర్కొన్నాడు. ఇందుకోసం గతంలో కంటే ఇప్పుడు 3 రెట్లు ఎక్కువగా శ్రమిస్తున్నానని తెలిపాడు. ఎన్నో ఒడుదుడుకులను నవ్వుతూ ఎదుర్కొన్నానని.. మెంటార్స్, సీనియర్లు చెప్పే కంటే ముందే చేసిన తప్పులను సరిదిద్దుకుని ముందడుగు వేయడం ఉత్తమమని చెప్పుకొచ్చాడు.