ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి అవార్డు
SDPT: దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించినందుకు గాను అంతర్జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. ఇటీవలే మూడు రకాల అవార్డులు సాధించామని ఆయన పేర్కొన్నారు. ఈ గుర్తింపు ఆసుపత్రి గౌరవాన్ని మరింత పెంచిందని హర్షం వ్యక్తం చేశారు.