గాజువాకలో కార్మిక గర్జన
VSP: విశాఖపట్నం గాజువాకలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. AIYF జిల్లా కార్యదర్శి కెంగువ అచ్యుతరావు చేతిలో పనిముట్లతో వినూత్నంగా పాల్గొని, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.