గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత

గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత

MNCL: హాజీపూర్ మండలం నంనూర్‌లోని చందనాపూర్ పునరావాస కాలనీలో ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని తరగతి గదుల్లో దోమల నివారణకు మందు స్ప్రే చేయగా.. లోపలికి వెళ్లిన విద్యార్థుల ముఖంపై దురదతో కూడిన దద్దుర్లు వచ్చాయి. వెంటనే వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.