నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా

నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా

WGL: జిల్లా కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సుదీర్ఘ సెలవుల అనంతరం సోమవారం పున: ప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ కొత్త పత్తి రూ.6,800, తేజ మిర్చి (AC) రూ.14,800, 341 మిర్చి రూ.17,900, వండర్ హార్ట్ (WH) రూ.17,000గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.