ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే తప్పనిసరి: కలెక్టర్
ASR: ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో మీకోసం 'గ్రీవెన్స్ డే' (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)ను తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్ కార్యక్రమానికి తహసీల్దార్, ఎంపీడీవోలు, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవ్వలన్నారు.