లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TPT: వడమాలపేటలో శుక్రవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. టీసీ అగ్రహారంకు చెందిన ఆర్.వెంకటేశ్ రూ. 61,811, సి. విజయ్ రూ.64,415, టి. మురగారెడ్డి రూ. 20,000 చెక్కులు అందజేశారు. ఈ మేరకు బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.