ప్రమాదకరంగా మారిన ఫ్లై ఓవర్

VZM: కొత్తవలస మండలం చిన్న రావుపల్లి వద్ద ఉన్న వంతెన ప్రమాదకరంగా మారిందని ప్రజలు తెలిపారు. వివరాల్లోకి వెళితే వంతెన పై ఎక్కడికి అక్కడ భారీ గుంతలు ఏర్పడి ఊసలు తేలి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఆర్‌అండ్‌బి అధికారులు గుంతలను పూడ్చే ప్రయత్నం చేయలని ప్రజలు కోరుతున్నారు.