గుణానపురంలో ఏనుగుల గుంపు సంచారం

మన్యం: కొమరాడ మండలం గుణానపురం సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రిపూట ఎవరూ ప్రయాణించరాదని అటవీశాఖ సిబ్బంది సూచించారు.