VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

HNK: హాసన్ పర్తి మండలం సీతంపేట క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఆదివారం టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బైక్ పై వెళ్తున్న యువకులను టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో దుర్గం పవన్, పౌతు మహేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. హసన్ పర్తి నుంచి సీతంపేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.