శ్రీలక్ష్మీతిరుపతమ్మ వార్షిక ఉత్సవాలు

శ్రీలక్ష్మీతిరుపతమ్మ వార్షిక ఉత్సవాలు

కృష్ణా: గన్నవరం మండలం పాతగన్నవరంలో ప్రసిద్ధ శ్రీలక్ష్మితిరుపతమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి వార్షిక ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. పాలపొంగళ్లు, లలితా సహస్రనామ పారాయణం, విశేష పూజలతో భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పట్టువస్త్రాలు సమర్పించగా, రాత్రి ఊరేగింపు, గ్రామోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.