మద్నూర్ మార్కెట్‌కు పోటెత్తిన పత్తి

మద్నూర్ మార్కెట్‌కు పోటెత్తిన పత్తి

KMR: మద్నూర్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సాగుతున్నాయి. పది రోజుల్లో సుమారు వంద క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం మేలు రకం పత్తికి క్వింటాకు రూ. 7,000, మూడో రకం పత్తికి రూ. 5,600 ధర పలుకుతోంది. జుక్కల్, పిట్లం, గాంధారి, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి రైతులు పత్తిని తరలిస్తున్నారు.