కొడంగల్ డిగ్రీ కళాశాలకు ISO గుర్తింపు

కొడంగల్ డిగ్రీ కళాశాలకు ISO గుర్తింపు

VKB: కొడంగల్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 2025-26 సంవత్సరానికిగాను ఐఎస్‌వో నాణ్యతా ప్రమాణాల గుర్తింపు లభించింది. ఐఎస్‌వో సంస్థ ప్రతినిధి శివయ్య శనివారం కళాశాలను సందర్శించి, వసతులు, బోధన, ప్రయోగశాలల్లో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. శ్రీనివాస్ రెడ్డికి నాణ్యతా ప్రమాణ పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.