రేపు రాజేంద్రనగర్‌లో ఫూలే జయంతి వేడుకలు
RR: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఈ నెల 11న మహాత్మా జ్మోతిబా ఫూలే జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు ఉత్సవాల కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహుజనల, వెనుకబడిన వర్గాల కోసం పూలే చేసిన సేవలను గుర్తుంచుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.