బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు

బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు

CTR: చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసిన బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, విశేష అలంకారం నిర్వహించారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చి తమ మొక్కులను చెల్లిస్తున్నారు. కాగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.