మంత్రి అచ్చెన్నాయుడుకు అరుదైన గౌరవం

SKLM: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరగనున్న వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేతకు, తదుపరి సందేశాన్ని ఇచ్చేందుకు శ్రీకాకుళం జిల్లా తరుపున మంత్రి అచ్చెన్నాయుడును ఎంపిక చేసారు. ఈ మేరకు వివిధ జిల్లాల వారీగా ఎంపికైన మంత్రుల జాబితాను ప్రభుత్వం వెల్లడించింది.