గ్రేహౌండ్స్ పోలీస్‌కు అరుదైన గౌరవం

SRPT: మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన కాంపాటి ఉపేందర్ గ్రే హౌండ్స్‌లో పనిచేస్తూ తక్కువ కాలంలోనే విశేష గుర్తింపు సాధించాడు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అరుదైన శౌర్య పథకం అందుకున్నాడు. ఈ ఘనత సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.