'విద్యార్థులు అభ్యున్నతికి కృషి చేయాలి'

'విద్యార్థులు అభ్యున్నతికి కృషి చేయాలి'

SKLM: పాతపట్నం ఏపీ మోడల్ స్కూల్‌లో బోటనీ ఉపాధ్యాయులు బల్లెడ అప్పలరాజు పాఠశాలలోని ల్యాబ్‌ను సొంత నిధులతో రూపొందించి విద్యా బోధన అందిస్తున్నారు. దీనిపై ఇటీవల మంత్రి లోకేష్ స్పందించి ప్రశంసించారు. ఈ మేరకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఆయనను తన క్యాంపు కార్యాలయంలో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. విద్యార్థుల మెరుగైన భవిష్యత్‌కు చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు.