'చెట్లను అక్రమంగా నరికి అమ్ముతున్నారు'

'చెట్లను అక్రమంగా నరికి అమ్ముతున్నారు'

PLD: అచ్చంపేట మండలం చల్లగిరిగా, తాడువాయి, చింతపల్లి గ్రామాల్లో అటవీ చెట్లను అక్రమంగా నరికి అమ్ముతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కత్తుల గోపి కృష్ణారెడ్డి ఆరోపించారు. అటవీ అధికారుల సమక్షంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రకృతిని కాపాడాల్సిన అధికారులు అవినీతికి పాల్పడి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని మండిపడ్డారు.