VIDEO: తిరుమల క్యూలైన్లో ఘర్షణ
AP: తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణతేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఘర్షణను నిలువరించారు. శ్రీవారి దర్శనార్థ వచ్చే భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకు దిగడం సమంజసం కాదని, ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని, క్యూలైన్ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.