పోలీస్ అధికారులతో ఎస్పీ జూమ్ మీటింగ్

VZM: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో శుక్రవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. శక్తి టీమ్స్ పనితీరు, రిపీటెడ్ నిందితులు, మహిళల అదృశ్యం, గంజాయి కేసులు మొదలగు వాటిపై సమీక్షించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించవలసిన విధులు, సాంకేతికత వినియోగంపై దిశా నిర్దేశం చేశారు.