VIDEO: నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ
HYD: నాంపల్లి కోర్టులో వైసీపీ అధినేత జగన్ విచారణ ముగిసింది. అక్రమాస్తుల కేసులో దాదాపు 6 సంవత్సరాల తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. విచారణకు హాజరైన జగన్ దాదాపు అరగంట కోర్టులో ఉన్నారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం కోర్టు నుంచి లోటస్ పాండ్‌లో తన నివాసానికి జగన్ బయలుదేరారు. అభిమానులు జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.