వీరబ్రహ్మేంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: దేవరకొండలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 332వ ఆరాధన మరియు దేవాలయ 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు ఆయన వెంట ఉన్నారు.