నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ

VZM: గజపతినగరంలోని కోవెలవీధిలో మంగళవారం నిరుపేదలకు చీరలు దుప్పట్లు మాజీ మంత్రి, జనసేన పిఎసి సభ్యురాలు పడాల అరుణ పంపిణీ చేశారు. జనసేన నేత తాళ్లపూడి త్రివేది సావిత్రి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. జుత్తాడ చిట్టిబాబు, తాళ్లపూడి ఈశ్వరరావు, మునకాల జగన్నాథరావు (జగన్), తాళ్లపూడి సౌమిత్రి త్రివేది, తాళ్లపూడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.