నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలి: కలెక్టర్

WGL: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. ఆరేపల్లిలోని ZPHSను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.