కలెక్టరేట్‌లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

JGN: జనగామ కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలను జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారి చిత్ర పటానికి పూలమాల వేసి అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ యువజన, క్రీడల అభివృద్ధి శాఖ అధికారి కోదండరాములు, ఆర్య వైశ్య సంఘం కుల పెద్దలు నాయకులున్నారు.