'ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి'
VZM: ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు కోరారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు శుక్రవారం గజపతినగరం జాతీయ రహదారిపై హ్యాపీ జర్నీ షేప్ జర్నీ ప్లకార్డులతో పోలీసులు ప్రదర్శన జరిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరాలన్నారు.