VIDEO: అభివృద్ధికి నోచుకోని పోరుమామిళ్ల బస్టాండ్.!
KDP: జిల్లాలోని పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ సమస్యలకు నిలయమైంది. చిన్నపాటి వర్షం వచ్చిందంటే ఈ బస్టాండ్ ఆవరణమంతా అధ్వానంగా ఉంటుంది. ఈ బస్టాండ్ నుంచి ప్రయాణికులు నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. శ్రీశైలం, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలకు వెళుతుంటారు. ఆర్టీసీ బస్‌స్టాప్‌లోకి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు.