కేసముద్రం మార్కెట్‌కు నాలుగు రోజుల సెలవులు
MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. మొంథా తుఫాన్ కారణంగా గురు శుక్రవారం ప్రత్యేక సెలవులు, శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు.