మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా విద్యార్థులు

మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా విద్యార్థులు

GDW: జిల్లా కేంద్రంలోని ఎస్‌విఎం కళాశాలలో విద్యార్థులు మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా సంతకాల సేకరణ నిర్వహించారు. మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతుగా విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్టేట్ మైనార్టీ మోర్చా అధ్యక్షులు అప్సర్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావు, తదితరులు పాల్గొన్నారు.