నంది మేడారం సర్పంచ్ బరిలో రిటైర్డ్ టీచర్

నంది మేడారం సర్పంచ్ బరిలో  రిటైర్డ్ టీచర్

PDPL: ధర్మారం మండలం నంది మేడారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఓ రిటైర్డ్ టీచర్ బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన కొమురయ్య 30 ఏండ్ల పాటు ప్రైవేట్ పాఠశాలను నడిపి, తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందారు. నిస్వార్ధంగా, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు సేవ చేయడానికి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు కొమురయ్య పేర్కొన్నారు.