'కాలేజీ కరస్పాండెంట్ పై చర్యలు తీసుకోవాలి'

'కాలేజీ కరస్పాండెంట్ పై చర్యలు తీసుకోవాలి'

కడప: శ్రీ కనకదుర్గ నర్సింగ్ కాలేజీలో చదివే సరస్వతిని కరస్పాండెంట్ రమణారెడ్డి బండ బూతులతో దూషించి, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఫీజు విషయంలో వివాదం జరిగితే ఆమెను మానసికంగా, భౌతికంగా వేధించారని తెలుస్తోంది. ఈ ఘటనను ఖండించిన విద్యార్థిసంఘాలు,ప్రజా నాయకులు ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని శనివారం డిమాండ్ చేశారు.