ఇరాన్‌లో నల్లటి ఆమ్ల వర్షం
ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్లు వార్తలొచ్చాయి. ఈ వర్షం కారణంగా తలనొప్పి, శ్వాస సమస్యలు, భవనాలు, వాహనాలపై కలుషిత జలాలు పేరుకుపోతున్నాయని ఇరాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. వైమానిక దాడుల అనంతరం కురిసే ఆమ్ల వర్షం అత్యంత ప్రమాదకరమని ఇరాన్‌కు చెందిన రెడ్ క్రిసెంట్ సొసైటీ పేర్కొంది.