కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్

దేశంలో చిన్న కార్ల ధరలు మరింత తగ్గనున్నాయి. కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉండటమే ఇందుకు కారణం. ఈ నిర్ణయంతో చిన్నకార్లతోపాటు పలు కార్ల ధరలు 8 శాతం వరకు తగ్గనున్నాయి. లగ్జరీ కార్లు 3-5 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.