ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం
BHNG: బొమ్మల రామారం మండల కేంద్రంలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఎం.హనుమంతరావు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.