VIDEO: ఫీజులు తగ్గించాలంటూ నిరసన

VIDEO: ఫీజులు తగ్గించాలంటూ నిరసన

SRD: జిల్లాలోని బీరంగూడలో రెయిన్ బో స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ గేటు ముందు కూర్చొని నిరసన తెలిపారు. అదనపు ఫీజుల పేరుతో విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు స్కూల్ ముందు బైఠాయించి, నిర్వాహకులు తక్షణమే స్పందించి ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు.