విద్యుత్ షాక్‌తో రైతు మృతి
NZB: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకోరలో విద్యుత్ షాక్‌తో గుట్టమీది గంగాధర్ (36) అనే రైతు మృతి చెందారు. బుధవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద కేబుల్ వైర్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వర్ని ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.