నూజివీడులో రేపు PGRS పోగ్రాం

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. డివిజన్‌లోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.