'అవకాశం ఇవ్వండి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'
JN: ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తామని బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి పొన్నాల స్రవంతి-అనిల్ అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఒక్క అవకాశం కల్పిస్తే సర్పంచ్‌గా గెలిచి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వంతో పోరాడి నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.