'డ్రైనేజీ సమస్యల పరిష్కారానికై చర్యలు'
SRD: డ్రైనేజీ సమస్యలను త్వరలో పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. మంగళవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ విస్తృతంగా పర్యటించి, స్థానిక సమస్యలను నేరుగా పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు HMWS మేనేజర్ అరుణ్ కుమార్, SFA గోవింద్ పాల్గొన్నారు.