గుంతలమయంగా రోడ్డు.. ఇబ్బందుల్లో వాహనదారులు

గుంతలమయంగా రోడ్డు.. ఇబ్బందుల్లో వాహనదారులు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి అంకుశపూర్ వెళ్లే రహదారి పూర్తిగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతింది. రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంకుశపూర్‌కు వెళ్లే దారిలో మెడికల్ కళాశాల ఉండడంతో నిరంతరం వాహనాలు వస్తూ పోతుంటాయి. రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.