'కమ్యూనిటీ హాల్‌కు స్థలం కేటాయించాలి'

'కమ్యూనిటీ హాల్‌కు స్థలం కేటాయించాలి'

MNCL: జైపూర్ మండలంలోని పౌనూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని PDSU జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ కోరారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ వనజ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు 500కు పైగా ప్రజలు నివసిస్తున్నారని, కమ్యూనిటీ హాల్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.