VIDEO: ఓటర్ల దినోత్సవ అవగాహన ప్రదర్శన
BDK: 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ములకలపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ విద్యార్థినులతో కలిసి తహశీల్దార్ భగవాన్ రెడ్డి అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొంటూ అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతిక విలువలతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.