HYDలో ఆత్మహత్యల వెనక కారణాలు ఇవే.!
HYD: నగరంలో నమోదవుతున్న ఆత్మహత్య కేసులను విశ్లేషించిన పోలీసులు అందుకు గల ప్రధాన కారణాలను వెల్లడించారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, మద్యం, జూదానికి బానిస కావడం, భార్యా భర్తల మధ్య వేధింపులు, నిరుద్యోగం, ప్రేమ విఫలం కావడం, అనారోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల చాలామంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.