కోళ్ల ఉత్పత్తి తగ్గుదలతో పెరిగిన మాంసం ధరలు
పల్నాడు జిల్లాలోని సతైనపల్లిలో కోడి మాంసం ధర భారీగా పెరిగింది. దీనికి ముఖ్య కారణం దాణా ధరలు పెరగడం, వేసవి నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మాంసం ధర పెరిగినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. ఆదివారం చికెన్ కేజీ రూ.340గా ఉంది. సోమ, మంగళవారాల్లో కూడా ఇదే ధర కొనసాగింది. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికమైతే ఉక్కబోతకు గురై కోళ్లు మృత్యువాతపడి ధరలు పెరిగే అవకాశముందని రైతులు పేర్కొంటున్నారు.