నకిలీ జీపీఏతో రూ. 14 కోట్ల భూమి స్వాహా
RR: జిల్లా జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డిపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ ఠాణాలో కేసు నమోదైంది. గచ్చిబౌలిలోని సర్వే నం.91లో రూ. 14 కోట్ల విలువైన 700 గజాల స్థలాన్ని జీపీఏ (General Power of Attorney) సృష్టించి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆర్వీ. రమణకుమార్ ఫిర్యాదు చేశాడు. మధుసూదన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.