కలెక్టరేట్లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

కలెక్టరేట్లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

HNK: లోక కల్యాణం కోసం దివి నుంచి భువికి పవిత్ర గంగాజలాన్ని తీసుకువచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని MLA నాయిని రాజేందర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. MLA పాల్గొని, కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి భగీరథ చిత్రపటానికి నివాళులర్పించారు.