జాతీయ లోక్ అదాలత్లో 611 కేసులు పరిష్కారం: జిల్లా న్యాయమూర్తి

BHPL: జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 611 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్. రమేష్ బాబు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్న కేసులకు సంబంధించి 165 కేసులకు జరిమానాలు విధించినట్లు సీవిల్ జడ్జి నాగరాజు పేర్కొన్నారు.