ఓంకార పుణ్యక్షేత్రంలో రుద్రాభిషేకం నిర్వహించిన భక్తులు

ఓంకార పుణ్యక్షేత్రంలో రుద్రాభిషేకం నిర్వహించిన భక్తులు

NDL: బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో వెలసిన శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం రెండవ సోమవారము సందర్భముగా భక్తుల రద్దీ నెలకొంది. దేవస్థానం ఛైర్మన్ అల్లే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, భక్తులచె సామూహిక బిల్వార్చన కార్యక్రమము నిర్వహించారు. భక్తులకు పూజరులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.