ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే
VZM: నవంబర్ 12న పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలోని వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ర్యాలీ పోస్టర్లను వైసీపీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకుండా ఆపే వరకు పోరాటం ఆగదన్నారు.